Login

Doc N Me Featured In Ennadu, the Largest Circulated Telugu Newspaper

Spread the love

We have featured again and this time we're featured in Ennadu the largest circulated Telugu newspaper in Andhra Pradesh and in Telangana.

To read the complete article please visit the original link.

అదో యాప్‌. లైమా అని పేరు. గర్భిణులకీ, ప్రసూతి వైద్యులకి మధ్య అనుసంధానంగా ఉంటుంది. వైద్యుల అపాయింట్‌మెంట్‌లు ఇప్పించే యాప్‌లు ఇప్పటికే చాలా ఉన్నాయ్‌! మరి లైమా ప్రత్యేకతేమిటీ అంటారా.. ఇందులో అప్పటికప్పడు వైద్యుల సలహాలూ తీసుకోవచ్చు. నెలతప్పినప్పటి నుంచి కడుపులోని బిడ్డ కదలికలదాకా ప్రతిదీ మీకు మీరే నమోదుచేయొచ్చు. చివరి నెలల్లో పుట్టింటికి వెళతారా? అక్కడి వైద్యులకి మీ వైద్యపరీక్షలూ, స్కానింగ్‌ వివరాలూ యథాతథంగా అందించే సౌలభ్యం ఇందులో ఉంది! హైదరాబాదీ సమిధా గరుడ్‌ దీని సృష్టికర్త. ఈ యాప్‌ వెనకున్న ఆశయాన్నీ, ప్రయాసని చెబుతున్నారామె..
హాయ్‌!
మాది మహారాష్ట్ర. అయినా 2001 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి.. నన్ను మీ తెలుగింటి ఆడపడచుగానే అనుకోవచ్చు! ఇంజినీరింగ్‌ చేశాక సాఫ్ట్‌వేర్‌ రంగంవైపు వెళ్లాను. అరాకిల్‌ సంస్థలో పనిచేశాను. ఎన్నో కొత్త ఆవిష్కరణలకి నేతృత్వం వహించాను. పదిహేనేళ్లు గడిచాక.. ఈ రంగంలో నాకున్న నైపుణ్యంతో సొంతంగా ఏదైనా చేయొచ్చు అనిపించింది. అప్పుడే నా గురించి తెలిసి ‘దీప్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ ప్రాజెక్టు కోసం పిలిచింది. విజయవాడ చుట్టుపక్కల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ‘ఆశా’ కార్యకర్తల కోసం ప్రత్యేక టాబ్లెట్‌ యాప్‌ తయారుచేయాలని చెప్పింది. అందుకోసం ఆ ప్రాంతాలంతా తిరిగాను. పల్లెపట్టుల్లోని గర్భిణులకి నిపుణులైన ప్రసూతి వైద్యుల సలహాలూ, సేవలూ అందడమెంత కష్టమో అప్పుడే అర్థమైంది నాకు! ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేయడం, వాటిని సమీప ఆసుపత్రుల్లోని వైద్యులకి చూపించి వారి సలహాలతో మందులిచ్చే విధంగా యాప్‌ రూపొందించి ఇచ్చాం. వాటిద్వారా 941 మంది గర్భిణులని నమోదుచేసి వైద్యసేవలు అందిస్తే.. ఆ ఏడాది ఒక్క మాతాశిశు మరణం కూడా చోటుచేసుకోలేదు! మాది ఇందులో కేవలం సాంకేతిక సహకారమే అయినా.. ఆ ఫలితం నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది. ప్రసూతి రంగానికి సంబంధించి మరెంతో పరిశోధన చేయడం మొదలుపెట్టా.

doc n me featured in ennadu

Doc N Me Featured In Largest Circulated Telugu Newspaper Ennadu

సమయం లేదసలు..!
మనదేశంలో ఏడాదికి మూడుకోట్ల జననాలు చోటుచేసుకుంటాయని అంచనా! కానీ మనకున్న ప్రసూతి వైద్యుల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 30 వేల మంది. ఈ గణాంకం ప్రకారం ఒక వైద్యురాలు రోజుకి మూడు ప్రసవాలు చేయాలి. అందుకే వాళ్లకి రోగులతో కనీసం పది నిమిషాలైనా మాట్లాడే పరిస్థితి లేదు! కేసు చిట్టా లేకుండా ప్రతి రోగి గురించి వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకునే తీరిక ఉండదు. రోగులు ఫోన్‌ చేసినా నిమిషమైనా మాట్లాడలేని పరిస్థితి వాళ్లది. ఇక, గర్భిణుల కోణం నుంచి చూస్తే.. నేటితరం అమ్మాయిలు ఇంచుమించు 27 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఆలస్యం కారణంగా సహజంగానే గర్భధారణ దగ్గర్నుంచి అనుకోని సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. పైగా ఉద్యోగినులు కనీసం ఎనిమిదో నెలవరకైనా విధులకి వెళ్లాలనే అనుకుంటున్నారు. అందువల్ల ఎప్పుడూ ఏదో ఒక సందేహం, ఇబ్బందీ తలెత్తుతాయి. ఒకవేళ అంతర్జాలం ఉందికదా అని చూస్తే.. అందులోని సలహాలు కొన్నిసార్లు తప్పుదారి పట్టించి కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదముంది. అలాగని ప్రతిరోజూ వైద్యులని వెళ్లి కలవలేరు. వెళితే.. కనీసం గంటైనా ఎదురుచూడాలి. ఉద్యోగబాధ్యతల్లో పడి సమయానికీ మందులు వాడటం, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం వంటివి మరచిపోయేవాళ్లూ తక్కువేమీ కాదు. ఇవన్నీ గమనించాకే అటు వైద్యులకీ, ఇటు గర్భిణులకీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నాం. ఫలితమే ‘డాక్‌ అండ్‌ మీ’ యాప్‌.

To read the original article please visit this link.


Spread the love

Comments are closed.